రాష్ట్ర శాసనసభలో బుదవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమాం గురించి సుదీర్గంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు క్లుప్తంగా:
• కాళేశ్వరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి రాష్ట్రానికి రూ.35 వేల కోట్లు ఆదా చేశాము.
• కాళేశ్వరం ప్రాజెక్టుని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎంతగా ప్రయత్నించినా ఆపకుండా పూర్తిచేశాము.
• పరిశ్రమలకి పవర్ హాలీడే ఇచ్చే స్థితి నుంచి మిగులు విద్యుత్, గరిష్ట విద్యుత్ వినియోగం దశకు చేరుకొన్నాము.
• గత ఏడాది రాష్ట్రం అప్పులు జీఏఏసీపీలో 24.7% ఉంటే ఈ ఏడాది 23.8%కి తగ్గించము.
• రాష్ట్ర పన్ను ఆదాయం 2017-18లో 90.3% ఉండేది. కరోనా సమయంలో మైనస్‌లోకి వెళ్ళినప్పటికీ ఇప్పుడు 100% ఆదాయం వస్తోంది.
• నేటికీ రాష్ట్రం మిగులులోనే ఉంది. 2014-15లో రూ.369 కోట్లు, ఆ తర్వాత వరుసగా రూ.238 కోట్లు, రూ.1,386 కోట్లు, రూ.3,48 కోట్లు, 2021-22లో రూ.4,337 కోట్లు ఉండేది. కరోనా సమయంలో మూడేళ్ళ పాటు మాత్రమే మైనస్‌లోకి వెళ్లింది.
• కేంద్రం నుంచి తెలంగాణకి రూ.1,27,109 కోట్లు రావాల్సి ఉంది.
• మిషన్ కాకతీయతో రాష్ట్రంలో చెరువులన్నీ పూడికలు తీసి గట్లు పటిష్టం చేయడంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఎంత పెద్ద వానలు కురిసినా గట్లు తెగిపోవడం లేదు.
• గడిచిన ఎనిమిదిన్నరేళ్ళలో రాష్ట్రంలో రైతులు, వ్యవసాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.92 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
• మిషన్ భగీరధ ప్రజలకి స్వచ్చమైన త్రాగునీరు అందిస్తున్నాము. ఫ్లోరైడ్ సమస్య కూడా శాస్వితంగా తీర్చేశాము.
• నిరుపేదలకి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీని కొనసాగించడమే కాకుండా రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకి పెంచాము. అవయవ మార్పిడి ఆపరేషన్లకి రూ.10 లక్షల చొప్పున అందిస్తున్నాము. రాష్ట్రంలో 21.50 లక్షల మంది ఆరోగ్యశ్రీతో వైద్యసేవలు పొందుతున్నారు.
• హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నాము.
• వరంగల్‌లో రూ.1,100 కోట్లతో 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాము.
• కిడ్నీ రోగులకి ఉచిత డయలాసిస్ కేంద్రాలని ఏర్పాటు చేశాము.
• మన ఊరు-మన బడి పేరుతో ప్రభుత్వ పాఠశాలలని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము. రూ.2850 కోట్లతో పాఠశాల అభివృద్ధి, రూ.500 కోట్లతో యూనివర్సిటీలలో మౌలికవసతులు కల్పిస్తున్నాము.