తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి టి.హరీష్‌రావు సోమవారం ఉదయం శాసనసభలో 2023-24 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ విలువ రూ. 2,90,396 కోట్లు. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు:
• ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ.
• అంగన్ వాడీ, ఆశా వర్కర్స్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కూడా ఇకపై ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఫిట్ మెంట్.
• త్వరలో సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ.
శాఖల వారీగా బడ్జెట్‌లో కేటాయింపులు ఈవిదంగా ఉన్నాయి:
• పంచాయతీరాజ్ శాఖ రూ.31,426 కోట్లు
• నీటిపారుదల శాఖ: రూ. 26,885 కోట్లు
• వ్యవసాయ శాఖ: రూ.26,831 కోట్లు
• విద్యాశాఖ: రూ. 19,093 కోట్లు
• విద్యుత్ శాఖ: రూ.12,727 కోట్లు
• వైద్య ఆరోగ్యశాఖ: రూ.12,161 కోట్లు
• పురపాలక శాఖ: రూ.11,372 కోట్లు
• హోమ్ శాఖ: రూ.9,599 కోట్లు
• పరిశ్రమల శాఖ: రూ.4,037 కోట్లు
• రోడ్లు భవనాల శాఖ: రూ.2,500 కోట్లు (రహదారుల మరమత్తుల కోసం)
• అటవీశాఖ: రూ. 1,471కోట్లు
• ప్రజా పంపిణీ: రూ.3,117 కోట్లు
• సంక్షేమ పధకాలకి బడ్జెట్‌లో కేటాయింపులు:
• ఎస్సీ సంక్షేమం: : రూ.36,750 కోట్లు
• ఎస్టీ సంక్షేమం: రూ.15,233 కోట్లు
• బీసీ సంక్షేమం: రూ.6,229 కోట్లు
• దళితబంధు: రూ.17,700 కోట్లు
• రైతుబంధు: రూ.15,000 కోట్లు
• మహిళా శిశు సంక్షేమం: రూ.2,131 కోట్లు
• ఆసరా పింఛన్లు: రూ.12,000 కోట్లు
• డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం: రూ.12,000 కోట్లు
• కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్: రూ.3,210 కోట్లు
• మైనార్టీ సంక్షేమం: రూ.2,200 కోట్లు
• జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమం: రూ.100 కోట్లు.