వందే భారత్‌ ప్రయాణికులు ఇంత అనాగరికులా?

January 28, 2023


img

యావత్ భారతీయులు ఎంతో గర్వించదగ్గ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో ప్రయాణికులు అత్యంత బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తుంది. బోగీలలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, టిఫిన్ ప్లేట్స్, ప్లాస్టిక్ కవర్స్ పడేసి బోగీల చెత్తకుప్పలుగా మార్చేస్తున్నారు. అవనీష్ శరణ్ అనే ఓ ఐఏఎస్ అధికారి చెత్తాచెదారంతో నిండిన వందే భారత్‌ బోగీలని పారిశుధ్య కార్మికుడు శుభ్రపరుస్తుండగా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ‘వియ్ ది పీపుల్” అనే చిన్న క్యాప్షన్ జోడించి, భారతీయులు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెప్పారు. 

వేలకోట్లు ఖర్చు చేసి అత్యంత ఆధునిక సదుపాయాలు కలిగిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళని మా రాష్ట్రానికి కేటాయించాలంటే ముందు మా రాష్ట్రానికి కేటాయించాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. తీరా కేటాయించి నడిపిస్తుంటే, కొన్ని ప్రాన్థ్గాలలో అల్లరిమూకలు రాళ్ళ దాడులు చేస్తున్నారు. వందే భారత్‌ రైళ్ళలో ప్రయాణించేవారు కూడా ఇంత బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. 



Related Post