సిఎం కేసీఆర్ ఎల్లుండి విజయదశమినాడు మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రగతి భవన్‌లో తన జాతీయపార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకొన్నారు. కానీ ఈరోజు మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కనుక ఎల్లుండి జాతీయ పార్టీ ప్రకటన చేయవచ్చా లేదా?అనే చర్చ మొదలైంది.
ఎన్నికల కోడ్ నల్లగొండ జిల్లాకి, మునుగోడుకే పరిమితం కనుక ఎల్లుండి ఉదయం ప్రగతి భవన్ టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకొని దానిలో జాతీయపార్టీ ప్రకటించుకోవచ్చునని, కనుక టిఆర్ఎస్ నేతలందరూ తప్పకుండా ఆరోజు ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకోవాలని సిఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
కానీ ఒకవేళ పార్టీ ఏర్పాటు గురించి అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అంటూ హైకోర్టులో కేసులు నమోదైతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న టిఆర్ఎస్‌లో వినబడుతోంది. పార్టీ ఏర్పాటు చేయగానే అది న్యాయవివాదాలలో చిక్కుకొంటే విపక్షాలకు అవకాశం కల్పించినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. అలాగని ముహూర్తం పెట్టుక్కొన్నాక పార్టీ ప్రకటనను వాయిదా వేసుకొన్నా అశుభంగా అనిపిస్తుంది. కనుక కేసీఆర్ ఎల్లుండి నిర్ణయించిన ముహూర్తంలో పార్టీని ప్రకటించడం ఖాయంగానే భావించవచ్చు.
హుజురాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఎన్నికల కోడ్ కారణంగా దళితబంధుకి అవరోధం వస్తుందని కేసీఆర్ ముందుగానే హడావుడిగా ప్రకటించేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది కనుక గిరిజనబంధు అమలుకి అవకాశం లేకుండా పోయింది. అయితే దాని గురించి ఎన్నికలలో ప్రచారం చేసుకొనేందుకు ఎటువంటి ఇబ్బంది