రామారావు డ్యూటీ దిగిపోయాక ధమాకా.. ఎలా ఉంటుందో?

August 30, 2022


img

మాస్ మహరాజ రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమా తర్వాత వచ్చిన రామారావు ఆన్‌ డ్యూటీ చితమ్ కూడా చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ధమాకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్‌ కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా సిసిరోలియా సంగీతం అందించాడు. 

బుదవారం సాయంత్రం 5.01 గంటలకు ధమాకా చిత్రం నుంచి రవితేజ, శ్రీలీలల రొమాంటిక్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ట్విట్టర్‌లో తెలియజేసింది. రామారావు డ్యూటీ దిగిపోయాక జరుగబోతున్న ఈ ధమాకా ఏవిదంగా ఉంటుందో చూడాలి. 


Related Post