నా ఉద్దేశ్యం అదికాదు.. రాజకీయలొద్దు: అనసూయ

August 19, 2022


img

ప్రముఖ యాంకర్, నటి అనసూయ మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. గుజరాత్‌లో బిల్కిస్ బానో అనే యువతిపై సామూహిక అత్యాచారం చేసినవారిని ఓ సంస్థపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “మన దేశానికి ఇదొక మచ్చ. సన్మానం చేయడానికి వారేమైనా స్వాతంత్ర్య సమరయోధులా? ఈరోజు బిల్కిన్ బానో... రేపు వేరెవరైనా కావొచ్చు... కనుక అందరం గళం విప్పండి, “ అని ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌పై అనసూయ స్పందిస్తూ, “ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే స్వేచ్చ, స్వాతంత్ర్యాన్ని పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అత్యాచారం చేసేవాళ్ళని వదిలేసి... మహిళల్ని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం,” అని రీట్వీట్ చేశారు.

అనసూయ కూడా నేరస్తులని శిక్షించడం చాలా అవసరమని చెపుతున్నట్లు అర్దమవుతూనే ఉంది. కానీ ఆమె అభిప్రాయం వేరేలా ప్రజలకు చేరింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. “హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు నోరు మెదపని మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?” అంటూ నిలదీస్తున్నారు.

వాటిపై అనసూయ స్పందిస్తూ, “ట్విట్టర్‌లో నేను  ఏం పెట్టినా... అవన్నీ నా అభిరుచి, ఇష్టాపూర్వకంగానే. ఒక వ్యక్తి, సంస్థ సిద్దాంతాన్ని ప్రమోట్ చేయడానికో లేదా డబ్బుల కోసమో నేను ట్వీట్స్ చేయడం లేదు. నేను ఏదైనా విషయంపై మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతోనే మాట్లాడుతాను. నాకు తెలియని వాటిపై నేను స్పందించను. స్పందిస్తే వాటిని తప్పుగా భావిస్తుంటారు. దాని వల్ల ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నా. కాబట్టి దయచేసి నా ట్వీట్లపై రాజకీయం చేయవద్దు,” అని ట్వీట్ చేశారు.   

          


Related Post