తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సిఎం కేసీఆర్ ప్రణాళికలు రచించి మంత్రులు, ఎమ్మెల్యేలకు మార్గదర్శనం చేస్తుంటే, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటి రంగాలను పరుగులు పెట్టిస్తూ, రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ తండ్రిని మించిన కుమారుడని అనిపించుకొంటున్నారు.
ఒకే దృక్పధం కలిగిన అటువంటి తండ్రీ కొడుకుల మద్య కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయని ఎవరూ అనుకోలేరు. కానీ అందరూ తండ్రీకొడుకుల్లాగే తమ మద్య కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయని, అలాగే తన పిల్లలకు కూడా తనపై కంప్లయింట్స్ ఉన్నాయని ఇటీవల ఓ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ నవ్వుతూ చెప్పారు. ఇటువంటి మరికొన్ని ఆసక్తికర విషయాలను మీడియా ద్వారా ప్రజలతో పంచుకొన్నారు.
తనకు తండ్రికి, అదేవిదంగా తనకు తన పిల్లలకు మద్య జనరేషన్ గ్యాప్ వలన భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం సహజమే అని చెప్పారు. అయితే నేడు తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తండ్రి కేసీఆరేనని, ఆయన నిర్మించిన పునాదులపైనే తామందరం పైకి ఎదిగామని చెప్పారు. కొన్ని పరిపాలన వ్యవహారాలలో తండ్రితో విభేదించినా, ఆయనే బాస్ కనుక ఆయన నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తుంటానని చెప్పారు.
“మీ పదవి హోదా వలన వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతున్నారా? మీరు, మీ కుటుంబం స్వేచ్చను కోల్పోతున్నారా?” అనే ప్రశ్నకు, “రాజకీయనాయకులందరికీ ఉండే సమస్యే ఇది. నా చిన్నప్పుడు నాకు నచ్చిన్నట్లు స్నేహితులతో కలిసి ఆడుకొనేవాడిని. కానీ ఇప్పుడు మా పదవులు, హోదా కారణంగా నా పిల్లలు ఆ స్వేచ్చను కోల్పోతున్న మాట వాస్తవం. అయితే వారు ఈ జనరేషన్ పిల్లలు కనుక వారి స్టైల్లో వారు జీవించేస్తుంటారు. ఈ పదవులు, అధికారం శాస్వితం కావని నాకు తెలుసు. ఈ పదవి, హోదాతోనే ఈ సమస్యలు, ప్రత్యేక గుర్తింపు పొందుతున్నానని కూడా నాకు తెలుసు. కనుక వీటన్నిటినీ నేను పెద్దగా పట్టించుకోను,” అని చెప్పారు.
మీ తీరని కోరిక ఏమైనా ఉందా?” అనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు. “నాకు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్‌ను ఒక్కసారి కలవాలని ఉంది. కానీ సాధ్యపడలేదని చెప్పారు.