కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా లభించదు: కేంద్రం

July 22, 2022


img

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నా కేంద్రం స్పందించడం లేదని, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని సిఎం కేసీఆర్‌ మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాదిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. 

కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి దీనిపై స్పష్టత ఇవ్వాలని లోక్‌సభలో కేంద్రాన్ని కోరగా, కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్  టుడు దీనికి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు హోదా ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ 2016లో ఓ సారి మళ్ళీ 2018లో మరోసారి ప్రధాని నరేంద్రమోడీకి వినతిపత్రాలు ఇచ్చారని దానిలో పేర్కొన్నారు. కానీ ఆ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, కనీసం పెట్టుబడులకు కూడా అనుమతులు తీసుకోలేదని తెలిపారు. కనుక హైపవర్ స్టీరింగ్ కమిటీ పర్యటించి, ప్రాజెక్టును పరిశీలించి నివేదిక ఇవ్వలేదని తెలిపారు. హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి లేనందున కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. 

దీనిపై టిఆర్ఎస్‌ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని కేంద్ర సహాయ మంత్రి పార్లమెంట్ సాక్షిగా అబద్దం చెప్పారు. సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎంపీలు, అధికారులు ఏడాదిన్నరపాటు కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్నీ అనుమతులు సాధించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు ప్రాజెక్టుకు అనుమతివ్వలేదని అబద్ధాలు చెప్తోంది అని తెలియజేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం ఇచ్చిన అనుమతుల వివరాలను విడుదల చేసింది.

డైరెక్టరేట్

అనుమతి ఇచ్చిన తేదీ

హైడ్రాలజీ

30.10.2017

ఇంటర్ స్టేట్

03.11.2017

కన్‌స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీ  

24.11.2017

పర్యావరణ,అటవీశాఖ

24.10.2017/22.12.2017

కేంద్ర భూగర్భజల శాఖ

21.11.2017

ఇరిగేషన్ ప్లానింగ్

11.04.2018

కాస్ట్ అప్రయిజల్

01.05.2018

వ్యవసాయ శాఖ

11.05.2018

సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ సెంటర్

21.05.2018

టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ

14.06.2018


Related Post