త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఇళ్ళు పంపిణీ

July 19, 2022


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే 2023 డిసెంబరులో జరుగుతాయి. అంటే ఏడాదిన్నర సమయం ఉందన్న మాట. ఎన్నికలకి ఆరు నెలల ముందు నుంచి సీట్లు, టికెట్లు, సిఎం, మంత్రుల జిల్లాల పర్యటనలు వంటివి ఉంటాయి కనుక ఇక మిగిలింది 12 నెలలు మాత్రమే అనుకోవచ్చు. ఒకవేళ సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటే ఆ మాత్రం సమయం కూడా ఉండదు. సిఎం కేసీఆర్‌ మనసులో ఏముందో తెలీదు కానీ తక్షణం నాలుగు ముఖ్యమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. 

1. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయింపు, 2. సొంత స్థలం ఉన్నవారికి రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందించడం, 3.అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు, 4. కొత్తగా అర్హులైనవారికి ఆసరా పింఛనులు. 

ఈ నాలుగు కార్యక్రమాల అమలుకి నెలకు రూ.1,000 కోట్లు చొప్పున కేటాయించి తక్షణం వాటిని అమలుచేయడానికి సన్నాహాలు చేస్తోంది.


Related Post