శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింగే తన పదవికి రాజీనామా చేయగా, ఆ దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్సే అధ్యక్ష భవనం విడిచి పారిపోయారు. ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోవడంతో దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో శనివారం దేశాధ్యక్షుడి ఇంటిని ముట్టడించారు. దాంతో ఆయన భద్రతా సిబ్బంది హడావుడిగా అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. దాంతో ప్రజలు అధ్యక్ష భవనంలో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.
ప్రజాగ్రహాన్ని గుర్తించిన ప్రధాని రనిల్ విక్రమసింగే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీలంకలో సంక్షోభం ఏర్పడిన తరువాత ఆయన ఇటీవలే నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ అది మూన్నాళ ముచ్చతే అయ్యింది. వేలాదిగా ప్రజలు ఆయన నివాసాన్ని చుట్టుముట్టడం అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ప్రధాని రాజీనామా చేయగానే కొంత మంది మంత్రులు కూడా రాజీనామా చేశారు. శ్రీలంకలో ప్రధాని, దేశాధ్యక్షుడు, మంత్రులు లేకపోవడంతో ప్రభుత్వం లేనట్లు తయారైంది. శ్రీలంకలో నెలకొన్న ఈ పరిస్థితులను చూస్తుంటే, ఈ సంక్షోభాన్ని ఏవిదంగా పరిష్కరించాలి? ఎవరు పరిష్కరించాలి?చివరికి ఏమవుతుంది? అనే జవాబు లేని ప్రశ్నలు వినిపిస్తున్నాయి తప్ప సమస్య పరిష్కారం అయ్యే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. శ్రీలంకకు తమిళుల ఉసురు తగిలినట్లుంది పాపం!