హైదరాబాద్‌ వస్తున్న బిజెపి నేతలకి టిఆర్ఎస్‌ స్వాగతం?

July 02, 2022


img

అవును... బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు వివిద రాష్ట్రాల నుంచి ఇవాళ్ళ హైదరాబాద్‌ నగరానికి వస్తున్న బిజెపి నేతలకు టిఆర్ఎస్‌ స్వాగతం పలుకుతూ సిఎం కేసీఆర్‌ ఫోటోతో దారి పొడవునా ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేసింది. 

ఇదేమిటి... బిజెపిని, నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కదా?మరి బిజెపి నేతలకి టిఆర్ఎస్‌ స్వాగతం పలకడం ఏమిటి?ఒకవేళ టిఆర్ఎస్‌ మనసు మార్చుకొని బిజెపితో దోస్తీకి సిద్దమైందా అనే కదా మీ సందేహం? కానే కాదు. కానీ బిజెపి నేతలకు స్వాగతం పలుకుతూ టిఆర్ఎస్‌ ఎక్కడికక్కడ దారిపొడవునా ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేసింది. ఇంతకీ టిఆర్ఎస్‌ ఏమి చేసిందంటే, గత 8 ఏళ్ళలో సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందిందో ఫోటోలతో సహా వివరిస్తూ, పక్కనే “వెల్ కమ్ టు తెలంగాణ” అని వ్రాశారు. అవేమిటో మీరే చూడండి.        

• ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్: 1; తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్: 1; రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ; ప్రపంచంలోకెల్ల అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టార్టప్, ఇన్నోవేషన్ కేంద్రం (టీ-హబ్‌)ను హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.

• దేశంలో అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్: 1, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్: 1, పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటులో తెలంగాణ నంబర్: 1, దేశంలో విద్యుత్‌ కోటలు లేని రాష్ట్రం తెలంగాణ... విద్య, వైద్యం, విద్యుత్, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వ్యవసాయం, సాగునీరు, వాణిజ్యం, మౌలిక వసతుల కల్పన… ఇలా అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పధకాల గురించి వివరిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేసింది. 

బిజెపి నేతలకి కనువిప్పు కలిగించేవిదంగా టిఆర్ఎస్‌ పెట్టిన ఈ ఫ్లెక్సీ బ్యానర్లనునగర ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకొంటుంటే, బిజెపి నేతలు లోలోన మండిపడుతున్నారు. 


Related Post