జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ తోడు ఎవరో?

June 16, 2022


img

త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికలో మోడీ ప్రభుత్వానికి పోటీగా రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టేందుకు బుదవారం ఢిల్లీలో బిజెపియేతర పార్టీలు సమావేశమయ్యాయి. ఈ నెల 20,21 తేదీలలో మరోసారి సమావేశమైన తరువాత అభ్యర్ధిని ప్రకటించాలని నిర్ణయించుకొన్నాయి.  

గమ్మతైన విషయం ఏమిటంటే, సిఎం కేసీఆర్‌ మూడేళ్ళ క్రితం కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు, దాని కోసం ఆయన మొట్ట మొదట కోల్‌కతా వెళ్ళి మమతా బెనర్జీనే కలిశారు. కానీ ఆమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యతను సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు! 

అలాగే ఫ్రంట్ ఏర్పాటు కోసం సిఎం కేసీఆర్‌ కలిసినవారిలో ఎన్సీపీ అధినేత శరత్ పవర్, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రే, ఝార్ఖండ్‌ (జెఎంఎం) ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, తమిళనాడు (డీఎంకె) సిఎం స్టాలిన్, జెడి(ఎస్) అధినేత దేవగౌడ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు. 

వారిలో శరత్ పవర్, దేవగౌడ, అఖిలేశ్ యాదవ్, జెఎంఎం, డీఎంకె పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తద్వారా తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగాలనుకొంటున్నట్లు స్పష్టం చేసినట్లే భావించవచ్చు. 

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ముందే వివిద పార్టీల వైఖరి ఏవిదంగా ఉందో ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది కనుక వివిద రాష్ట్రాలకు చెందిన ఈ పార్టీల మద్దతు, సహాయసహకారాలు లేకుండా జాతీయ రాజకీయాలలో ఏవిదంగా ముందుకు సాగాలనేది నిర్ణయించుకొని అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. 


Related Post