తెలంగాణకు 296 కోట్లు, ఏపీకి 3,199కోట్లు, తమిళనాడుకి 9,602 కోట్లు?

June 01, 2022


img

దేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా పన్నుల రూపేణా కేంద్రానికి వెళుతుంటుంది. అయితే కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఎస్టీ బకాయిలను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి కేవలం రూ.296 కోట్ల బకాయిలు చెల్లించగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.3,199 కోట్లు, తమిళనాడు రాష్ట్రానికి రూ. 9,602 కోట్లు విడుదల చేసింది. కేంద్రప్రభుత్వం మొత్తం రూ.86,912 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల చేయగా దానిలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.296 కోట్లు మాత్రమే అంటే నమ్మశక్యంగా లేదు. 

తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఇదే విషయంపై గట్టిగా వాదిస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళుతున్న సొమ్ములో  కనీసం పావు వంతు కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శిస్తోంది. కానీ కేంద్రం మాత్రం భారీగా నిధులు ఇస్తున్నామని చెపుతోంది. రాష్ట్ర బిజెపి నేతలు కూడా రాష్ట్రానికి జరుగుతున్నా ఈ అన్యాయం గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావడం గురించి మాత్రమే ఆలోచిస్తుండటం చాలా బాధాకరం. రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర బిజెపి నేతలు దానికి సమాధానం చెప్పకుండా సిఎం కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి అంటూ విమర్శలు చేస్తున్నవారికి ఎందుకు ఓట్లు వేయాలి? రాష్ట్రానికి ఏమి చేశారని అధికారం కట్టబెట్టాలి?అని ప్రజలు వారిని నిలదీసి అడగడం చాలా అవసరం. 


Related Post