ఏదో ఓ రోజు కేటీఆర్‌ తప్పకుండా ప్రధాని కావచ్చు!

May 24, 2022


img

ఈ మాట అన్నది ఏ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలో, నేతలో కాదు.. దావోస్‌ సదస్సులో పాల్గొన్న ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ ఆశా జడేజా మోత్వాని అన్నారు. దావోస్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో బృందం వివిద దేశాల సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులతో ఎంతో చురుకుగా, చాకచక్యంగా వ్యవహరిస్తూ, వారిని ఆకట్టుకొనేలా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని ఆమె ప్రశంశలు కురిపించారు. ఇటీవల కాలంలో   కేటీఆర్‌ లాగా ఆలోచనలలో అంత స్పష్టత, మళ్ళీ దాన్ని ఇతరులకు అర్థమయ్యేలాగా చక్కగా వివరించి చెప్పగలిగే నేర్పు ఉన్న యువ రాజకీయ నేతలను నేను చూడలేదు. దావోస్‌లో తెలంగాణ టీమ్‌ దూసుకుపోతోంది. వారిని చూస్తుంటే ఈ రోజు బిలియన్‌ డాలర్ల వ్యవస్థగా విస్తరించిన సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌గా ఉన్న ఆ రోజులు మళ్ళీ నాకు గుర్తుకు వస్తు‍న్నాయి. రాబోయే ఇరవై ఏళ్లలో భారత్‌కి కేటీఆర్‌ ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు,” అని ప్రశంశిస్తూ దావోస్‌లో కేటీఆర్‌ బృందంతో దిగిన ఫోటోను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలు కేటీఆర్‌ ధాటిని ఎదుర్కొలేకనే వారసత్వ రాజకీయాలు అంటూ విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ కేటీఆర్‌ రాజకీయాలలో, పార్టీలో, ప్రభుత్వంలో, పాలనలో తిరుగులేని నాయకుడిగా తనను తాను నిరూపించుకొని చూపుతూనే ఉన్నారు. కనుకనే ఆయన తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అందరూ భావిస్తున్నారని చెప్పవచ్చు.   



Related Post