రాహుల్‌కి అనుమతి వచ్చింది కానీ ఏం సాధిస్తారు?

May 04, 2022


img

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీలలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. తొలిరోజున కాంగ్రెస్‌ అధ్వర్యంలో వరంగల్‌లో జరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. మర్నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్డులతో ముఖాముఖీ సమావేశం కావాలనుకొన్నారు. కానీ ఓయూ అధికారులు నిరాకరించడంతో ఎన్‌ఎస్‌యుఐ తరపున మానవ్ రాయ్, ప్రతాప్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ రాహుల్ గాంధీ 150 మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి ఓయూ విద్యార్దులతో సమావేశం అయ్యేందుకు అనుమతించాలని ఓయూ అధికారులను ఆదేశించింది. 

ఓయూలో రాహుల్ గాంధీ సమావేశాన్ని అనుమతించనందుకు గత రెండు మూడు రోజులుగా ఓయూలో ఎన్‌ఎస్‌యుఐ  విద్యార్ధులు, మరోపక్క కాంగ్రెస్‌ నేతలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. 

రాహుల్ గాంధీ వంటి ఓ జాతీయ స్థాయి నాయకుడు, రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పుడు దానిని పూర్తిగా సద్వినియోగపరుచుకొని పార్టీకి లబ్ది చేకూర్చాలి. ఇప్పుడు రాహుల్ సమావేశానికి అనుమతి లభించింది కనుక మరి ఆయన విద్యార్దులతో ఏమి మాట్లాడుతారో, దాంతో రాష్ట్ర కాంగ్రెస్‌కు ఏమేరకు లాభం కలుగుతుందో చూడాలి.


Related Post