ధాన్యం కొనుగోలులో ఇవీ వాస్తవాలు...

April 12, 2022


img

ధాన్యం కొనుగోలుపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య, రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్‌, బిజెపిలకు మద్య యుద్ధం నడుస్తోంది. సిఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిన్న టిఆర్ఎస్‌ ప్రజాప్రతిధులు ఢిల్లీలో ధర్నా చేయడం ఈ యుద్ధపర్వంలో మరో అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఈ సమస్యపై టిఆర్ఎస్‌, బిజెపిలు చేస్తున్న పూర్తి భిన్నమైన వాదనలతో ప్రజలు, రైతులలో చాలా అయోమయం నెలకొంది. ఈ అయోమయాన్ని తొలగించేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరా శాఖ కార్యదర్శి సుధాంశు పాండే నిన్న వివరణ ఇచ్చారు. ఆయన ఏమి చెప్పరంటే...       

“ఏటా రాష్ట్రాలలో పండే ధాన్యం, గోధుమలను కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేసి, నిలువచేసి మళ్ళీ అవసరమైనప్పుడు రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంటుంది. ఈ ప్రక్రియలో రాష్ట్రాలు కేంద్రానికి, రైతులకు మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుంటాయి. రైతులకు డబ్బు చెల్లించి ధాన్యం కొనుగోలు చేసి, దానిని మరపట్టించి కేంద్రానికి ఇచ్చి, మళ్ళీ కేంద్రం నుంచి ఎంఎస్‌పి, రవాణా, నిల్వ, మిల్లింగ్ ఛార్జీలకు అయిన ఖర్చు మొత్తం తిరిగి తీసుకొంటుంటాయి. దేశంలో అనేక దశాబ్ధాలుగా అన్ని రాష్ట్రాలలోఈవిదమైన ఒకే విధానం అమలులో ఉంది.  

అయితే దొడ్డు బియాన్ని (బాయిల్డ్ రైస్)ని ఎవరూ తినడానికి ఇష్టపడటం లేదు. పైగా కేంద్రం (ఎఫ్‌సీఐ) గోదాములలో 40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం నిలువలు ఉన్నాయి. కనుక మళ్ళీ దుడ్డు బియ్యం పండించవద్దని, పైందిస్తే తీసుకోబోమని చెపుతున్నాము. కానీ ముడి బియ్యం (రా రైస్)కి చాలా డిమాండ్ ఉంది. కనుక అది ఎంతిస్తే అంతా తీసుకొంటామని చెపుతున్నాము,” అని చెప్పారు.  

ఇక పంజాబ్‌ తరహాలో ధాన్యం సేకరించాలనే టిఆర్ఎస్‌ ప్రభుత్వ వాదనపై మాట్లాడుతూ, “పంజాబ్‌లో ప్రజలు అన్నం తినరు. రొట్టెలు తింటారు. కనుక వారు కేంద్రానికి సరఫరా చేయడం కోసమే ‘ముడి బియ్యం’ పడిస్తుంటారు. అందుకే వారు పండించిన మొత్తం ముడి బియ్యం కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుంటుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కూడా ముడి బియ్యమే పండించి ఇస్తే ఎంత ఇస్తే అంతా తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాము. కానీ తెలంగాణ ప్రజలు కూడా తినని దుడ్డు బియ్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తోంది. అది సాధ్యం కాదని చెపుతున్నాము. ఒకవేళ తెలంగాణలో ప్రజలు దుడ్డు బియ్యం తింటున్నట్లయితే, కేంద్రప్రభుత్వం తప్పకుండా తెలంగాణ నుంచి దుడ్డు బియ్యం కొనుగోలు చేసి అవసరమైనప్పుడు రాష్ట్రానికి పంపిణీ చేస్తుంది.

వాస్తవానికి తెలంగాణ ప్రజలు కూడా తమ ఆహారంలో ముడి బియ్యాన్ని మాత్రమే వినియోగిస్తారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకి సరిపడా ఉంచుకొని మిగిలిన బియ్యాన్ని కేంద్రానికి ఇస్తుంటుంది. అయితే గత సీజనులో చేసుకొన్న ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఒకటిన్నర లక్షల టన్నుల ముడి బియ్యం కేంద్రానికి సరఫరా చేయవలసి ఉంది కానీ ఇంతవరకు చేయలేదు. 

మిల్లింగ్ నష్టాలపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలు కూడా సరికావని భావిస్తున్నాను. ఇంచుమించు ఒకే వాతావరణ పరిస్థితులున్న ఏపీలో రాని నష్టాలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వస్తాయి? కేంద్రప్రభుత్వం వడ్లను కొని మిల్లింగ్ చేయించలేదు. కనుకనే రాష్ట్రాలకు ఆ ఛార్జీలను కూడా చెల్లించి తీసుకొంటోంది. కనుక కేంద్రమే వడ్లను కొనాలనే వాదనలు కూడా సరికాదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దుడ్డు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవాలనుకొంటే నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చు. కేంద్రం కూడా దానికి సహకరిస్తుంది,” అని చెప్పారు. 


Related Post