అయోమయంలో ఉన్నారా... అయోమయం సృష్టిస్తున్నారా?

April 12, 2022


img

ధాన్యం కొనుగోలు వ్యవహారంపై టిఆర్ఎస్‌ నేతలు చాలా స్పష్టంగానే ఉన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని అడుగుతున్నారు. కానీ ఈ విషయంలో తెలంగాణ బిజెపి నేతల మాటలు వింటున్నప్పుడు వారు అయోమయంలో ఉన్నారా...లేక ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజలలో అయోమయం సృష్టిస్తున్నారా?అనే సందేహం కలుగకమానదు. ఎందుకంటే ఓసారి తెలంగాణ పండిన ప్రతీ బియ్యం గింజని కేంద్రమే కొనుగోలుచేస్తుందని వాదిస్తుంటారు. మరోసారి తెలంగాణ పండిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వాడిస్తుంటారు. ఇంతకీ ధాన్యాన్ని కేంద్రం కొనాలా లేక రాష్ట్ర ప్రభుత్వం కొనాలా?బిజెపి నేతలు స్పష్టంగా చెపితే బాగుంటుంది. కానీ ఓ సారి రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని మరోసారి కేంద్రప్రభుత్వమే కొంటుందని మాట్లాడుతూ ప్రజలలో గందరగోళం సృష్టించగలరేమో గానీ ప్రజలతో ఇటువంటి ఆటలు ఆడితే చివరికి వారే నష్టపోవడం ఖాయం అని గ్రహిస్తే మంచిది. అలాగే రైతుల జీవన్మరణ సమస్య అయిన దీనిపై టిఆర్ఎస్‌, బిజెపిలు రాజకీయాలు చేస్తుంటే రెండూ కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని గ్రహిస్తే మంచిది.     



Related Post