టొమేటోకి గిట్టుబాటు ధర రాదు...ధాన్యం కొనేనాధుడు లేడు

April 06, 2022


img

మంగళవారం బైంసా మార్కెట్ లో టొమేటో ధర కిలో రూ.10-12 నుంచి ఒకేసారి రూ.4కి తగ్గించేయడంతో రైతులు కష్టపడి పండించిన టొమేటోలను రోడ్లపక్క పారబోసి వెళ్ళిపోయారు. టొమేటో రైతుల కష్టాలు ఈవిదంగా ఉంటే, వరి రైతుల కష్టాలు మరోలా ఉన్నాయి. ఈ యసంగిలో పండిన దొడ్డు బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ముందే చెప్పినప్పటికీ, వేరే గత్యంతరం లేక వరి పండించిన రైతులు, ఇప్పుడు చేతికి వస్తున్న పంటను ఎవరికి అమ్ముకోవాలో...ఎవరు కొంటారో...అసలు అమ్ముడవుతుందో లేదో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

కేంద్రమే ధాన్యం మొత్తం కొనాలని టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే, ధాన్యం కొనుగోలు పేరుతో టిఆర్ఎస్‌ రాజకీయాలు చేస్తోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న టిఆర్ఎస్‌, బిజెపిలు రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటే వరి రైతులు ఏమి చేయాలో పాలుపోక తీవ్ర ఆవేదన, ఆందోళనతో ఉన్నారు. 



Related Post