పుతీన్‌ను శిక్షించగలవాడు ఈ భూప్రపంచంలో ఉన్నాడా?

March 16, 2022


img

గత మూడు వారాలుగా రష్యా దళాలు ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు నివసించే భవనాలపై బాంబుల వర్షం కురిపిస్తూ వేలాదిమందిని బలిగొన్నాయి. కనుక దీనికంతటికి కారకుడైన రష్యా అధ్యక్షుడు పుతీన్ ఓ యుద్ధ నేరస్థుడిగా పరిగణించి అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టాలని కోరుతూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన ఓ తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 

రష్యాపై అమెరికా, యూరోప్ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రేయింబవళ్లు ఉక్రెయిన్‌ ప్రజల ఇళ్ళపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. తన దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలని అనుకోవడం తప్పు కాదు. కానీ అందుకోసం ప్రజల ప్రాణాలు తీయాలనుకోవడమే పెద్ద తప్పు. రెండు దేశాల మద్య యుద్ధం అంటే అది సైనికులు లేదా వారి త్రివిద దళాల మద్య జరగాలి కానీ ప్రజలతో కాదనే చిన్న విషయాన్ని మరిచి పసిపిల్లల ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకొంటున్న పుతీన్ ఖచ్చితంగా యుద్ధ నేరస్థుడే. అవసరమైతే అణుబాంబులు వేసి యావత్ ప్రపంచదేశాలను బూడిద చేసేస్తానని బెదిరిస్తున్న పుతీన్‌ మనిషి అని కూడా భావించలేము. కనుక మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసుడిని శిక్షించగల మగాడు ఈ భూప్రపంచంలో ఎవరున్నారు?అని వెతికినా ఎవరూ కనబడటం లేదు. కనుక పుతీన్ అలిసిపోయే వరకు లేదా విసుగెత్తి యుద్ధం నిలిపివేసేవరకు ఉక్రెయిన్‌లో ఈ మారణహోమం కొనసాగుతూనే ఉంటుంది. చిన్నారులు, అమాయక ప్రజలు చనిపోతూనే ఉంటారు. ప్రపంచదేశాలు తీర్మానాలు చేస్తూ కాలక్షేపం చేస్తూనే ఉంటాయి. 


Related Post