తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కాన్ఫరెన్సులో పాల్గొనవలసిందిగా ఆహ్వానం అందింది. ఈ నెల 20వ తేదీన హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ఇండియా కాన్ఫరెన్స్‌ఎట్ హార్వర్డ్ లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి అలాగే టర్బో ఛార్జింగ్ భారత్@ 2030 అనే అంశంపై ప్రసంగించవలసిందిగా ఆహ్వానించింది. వ్యక్తిగతంగా ఇది మంత్రి కేటీఆర్ ప్రతిభకు, మంత్రిగా ఆయన సమర్దతకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన చక్కటి గుర్తింపు ఇది అని చెప్పవచ్చు. అదేవిదంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కూడా అంతర్జాతీయ స్థాయిలో లభించిన మంచి గుర్తింపుగా భావించవచ్చు. తెలంగాణలో సమస్యలు తప్ప అభివృద్ధి జరగడంలేదన్నట్లు ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు కూడా ఇది చక్కటి జవాబు అని భావించవచ్చు.
Look forward 👍 https://t.co/Pgb4E8wjgF
— KTR (@KTRTRS) February 18, 2022