కరోనా తాజా రూపం నియోకోవ్. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్. ఇది సోకిన ప్రతీ ముగ్గురిలో ఒకరు చనిపోతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది దక్షిణాఫ్రికాలోనే క్రమంగా వ్యాపిస్తోంది. ఇంకా ప్రపంచదేశాలకు వ్యాపించలేదు.
దక్షిణాఫ్రికాలో దాని కంటే ముందు పుట్టిన ఒమిక్రాన్ వైరస్ మాత్రం భారత్‌కు వచ్చేసింది. అయితే ఇది అంత ప్రమాదకరమైనది కాదని ఇప్పటికే తేలింది. సాధారణ జలుబు, జ్వర లక్షణాలు మాత్రమే కలుగజేస్తోంది. కొద్దిపాటి జాగ్రత్తలు, వైద్య చికిత్సతో సులువుగా దీని నుంచి విముక్తి పొందగలుగుతున్నారు. అయితే ఈ ఒమిక్రాన్ వైరస్ గురించి కొన్ని విషయాలు అందరూ తప్పక తెలుసుకోవడం చాలా అవసరం ఉంది.
ఇది మానవ చర్మంపై 21 గంటలు సజీవంగా ఉండగలదు. ఈ సమయంలోనే అది శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది లేదా ఇతరులకు వ్యాపిస్తుంటుంది. అలాగే మనం నిత్యం వాడే ప్లాస్టిక్ కవర్స్ లేదా బ్యాగులు, ప్లాస్టిక్ డబ్బాలపై 8 రోజులపాటు ఈ ఒమిక్రాన్ వైరస్ సజీవంగా ఉండగలదు. అంటే పళ్ళు, కూరగాయలు, పప్పులు, నూనె ప్యాకెట్లు, మాంసాహారాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇళ్లకు తెచ్చుకొన్నప్పుడు వాటితో పాటు ఒమిక్రాన్ కూడా ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందన్నమాట! అందుకే ఇళ్ళలో నుంచి బయటకురాని వృద్ధులకు కూడా కరోనా సోకుతున్నట్లు అర్ధమవుతోంది.
మరో విషయం ఏమిటంటే, ఒమిక్రాన్ వైరస్‌ను కేవలం జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. అయితే దేశంలో ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. కనుక ఒమిక్రాన్ కేసులన్నిటినీ వెనువెంటనే గుర్తించడం సాధ్యపడటం లేదు. అంటే జీనోమ్ సీక్వెన్సింగ్‌లో గుర్తించిన కొద్దిపాటి కేసులను మాత్రమే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నివేదికలలో కనబడుతున్నాయన్న మాట! కనుక దేశంలో గుర్తించని ఒమిక్రాన్ కేసులు వేలు లేదా లక్షల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది.
మన దేశంలో ప్రజలకు రోగ నిరోధకశక్తి ఎక్కువ కనుక చాలా మంది ఒమిక్రాన్ బారినపడినా సులువుగానే బయటపడుతుండవచ్చు కానీ కొన్ని దేశాలలో ఒమిక్రాన్ మరణాలు కూడా నమోదవుతున్నాయి. కనుక అందరూ కరోనా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.