వెయ్యి డ్రోన్ల అద్భుత ప్రదర్శనతో ముగిసిన బీటింగ్ రిట్రీట్

January 29, 2022


img

గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపులో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో విజయ్ చౌక్ వద్ద శనివారం సాయంత్రం బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో సైనిక, పారామిలటరీ దళాల కవాతు, సరికొత్త ట్యూన్స్‌తో బ్యాండ్ అందరినీ ఆకట్టుకొన్నాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా భారత్‌ చారిత్రిక ఘట్టాలను తెలియజేస్తూ   సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ గోడలపై లేజర్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో కన్నుల పండుగలా సాగింది. చివరిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన 1,000 డ్రోన్లు నింగికెగిసి చేసిన లేజర్ షో ప్రదర్శన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఒకేసారి ఇన్ని డ్రోన్లతో లేజర్ షో నిర్వహించాయి. ఇప్పుడు వాటి సరసన భారత్‌ కూడా నిలిచింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్ల తయారీలో భారత్‌ అగ్రదేశాలకు తీసిపోదని నిరూపించి చూపింది. ఐఐటి ఢిల్లీ సహకారంతో ఢిల్లీలోని స్టార్ట్ అప్ కంపెనీ బోట్ ల్యాబ్స్ డైనమిక్స్ ఈ డ్రోన్లను తయారుచేసింది. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినవారు ఈ వీడియోను చూసి ఆనందించవచ్చు.  

బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, పలువురు కేంద్రమంత్రులు, త్రివిద ధళాధిపతులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.    




Related Post