ఐఓసీ నిర్ణయంతో ఆసియా దేశాలకు ఒలింపిక్స్‌లో నష్టం?

December 11, 2021


img

2028లో లాస్ ఏంజెలిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్‌ పోటీలలో బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌, రన్నింగ్, స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్, ఈక్వెస్ట్రియన్ ఐదు క్రీడల సమాహారమైన మోడ్రన్ పెంట్లాధాన్‌ను తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)భావిస్తోంది. వాటి స్థానంలో స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్‌లను కొత్తగా ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. 

మోడ్రన్ పెంట్లాధాన్‌ పోటీలలో పాల్గొనేవారు డ్రగ్స్ (ఉత్ప్రేరకాలు) సేవిస్తుండటం, వాటికి పెద్దగా ప్రజాధారణ లేకపోవడం, స్పాన్సర్స్ లభించకపోవడం తదితర కారణాలతో తప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో అమెరికా, యూరోప్ దేశాలలో అత్యంత ప్రజాధారణ గల స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్‌లను ప్రవేశపెట్టాలని ఐఓసీ భావిస్తున్నట్లు సమాచారం. ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి కానీ అటువంటి ఆలోచనలేదని ఐఓసీ ప్రతినిధి చెప్పినట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ఐఓసీ ఈ నిర్ణయాన్ని అమలుచేస్తే భారత్‌ చాలా నష్టపోతుంది. ఎందుకంటే భారత్‌కు బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌, రన్నింగ్, షూటింగ్‌ పోటీలలోనే మెడల్స్ సాధిస్తుంటుంది. స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్‌ వంటివి ఆసియా దేశాలలో..ముఖ్యంగా భారత్‌లో పెద్దగా కనబడవు. కనుక భారత్‌తో సహా ఆసియా దేశాలను తప్పించి, అమెరికా యూరోప్ దేశాలకు ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించడానికే ఐఓసీ ఈ మూడు పోటీలను ప్రవేశపెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.


Related Post