క్లుప్తంగా బిపిన్ రావత్ ప్రస్థానం

December 08, 2021


img

బుదవారం మధ్యాహ్నం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిద ధళాధిపతి బిపిన్ రావత్‌, ఆయన భార్య మధులికా రావత్‌ సహా మొత్తం 13 మంది చనిపోయారు. భారత్‌ ఆర్మీకే వన్నె తెచ్చిన మహాయోధుడు బిపిన్ రావత్. బిపిన్ రావత్ గురించి ఎంత చెప్పినా అది అద్దంలో కొండను చూపినట్లే ఉంటుంది. ఆయన గురించి వ్రాస్తే ఓ పుస్తకం కూడా సరిపోదు.

కేంద్రప్రభుత్వం తొలిసారిగా త్రివిధ దళాలను సమన్వయపరుస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనే పదవిని సృష్టించి 2019, డిసెంబర్‌ 30న దాని బాధ్యతలను బిపిన్ రావత్‌కు అప్పగించింది. అయితే సీడీఎస్‌ తొలి జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈవిదంగా మరణించడం చాలా బాధాకరం. క్లుప్తంగా ఆయన జీవిత విశేషాలు...    

బిపిన్ రావత్ పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్‌ రావత్. ఆయన 1958, మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా ఆర్మీలో పనిచేసి లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పదవీ విరమణ చేశారు. 

చదువు: 

• కాంబ్రియాన్ హాల్ స్కూల్ డెహ్రాడూన్, సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్, సీమ్లాలో విధ్యాభ్యాసం పూర్తి చేసారు.

• నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్‌వస్ల, ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్‌లో చేరారు. దానిలో ఆయనకు స్వోర్డ్ ఆఫ్ హానర్ పొందారు.       

• డిఫెన్స్ సర్వీసస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్‌టన్‌లో డిగ్రీ చేశారు. (నిన్న అక్కడికే వెళుతుండగా మృతి చెందారు). 

• యుఎస్ ఆర్మీ కమాండ్ అండ్ గనరల్ స్టాఫ్ కాలేజ్, కన్సాస్‌లో హయ్యర్ కమాండ్ కోర్స్ చేశారు. 

• యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి డిప్లొమా ఇన్‌ మేనేజిమెంట్, కంప్యూటర్ స్టడీస్ చేశారు. 

• చౌదరీ చరణ్ సింగ్‌ యూనివర్సిటీ, మీరట్ నుంచి మిలటరీ-మీడియా స్ట్రాటజిక్ స్టడీస్‌ అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు          

పదవులు:  

సెకండ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్ (సిఓఏఎస్), జనరల్ (సీడీఎస్) హోదాలలో 40 ఏళ్ళపాటు ఆర్మీకి  సేవలందించారు. 

• 1978, డిసెంబర్‌ 16వ తేదీన గూర్ఖా రైఫిల్స్ విభాగంలో 5వ బెటాలియన్‌లో చేరారు. తరువాత బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. అప్పుడు ఆయన ఆఫ్రికా దేశమైన కాంగోలో శాంతిస్థాపనకు వెళ్ళిన సైనిక బృందానికి నాయకత్వం వహించారు. 

• తరువాత మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. అప్పుడు ఆయన 19వ ఇన్ఫాంట్రీ డివిజన్ (యూరీ)కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా వ్యవహరించారు. 

• 2016, డిసెంబర్‌లో 17వ తేదీన ఆయన భారత్‌ 27వ చీఫ్ ఆఫ్ డ్‌ ఆర్మీ స్టాఫ్ గా నియమితులయ్యారు.  

• పదవీ విరమణ చేసిన తరువాత 2019, డిసెంబర్‌ 30న త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. 

పతకాలు: 

• పరమ్ విశిష్ట సేవా మెడల్; ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్; అతి విశిష్ట సేవా మెడల్; సేనా మెడల్; విశిష్ట సేవా మెడల్; వూండ్ మెడల్; సామాన్య సేవా మెడల్; స్పెషల్ సర్వీస్ మెడల్; ఆపరేషన్ పరాక్రమ్ మెడల్; సైన్య సేవా మెడల్; అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ అల్టిట్యూడ్ మెడల్; విదేశ్ సేవ మెడల్; 50వ స్వాతంత్ర దినోత్సవ మెడల్; 30 ఏళ్ళు లాంగ్ సర్వీస్ మెడల్; 20 ఏళ్ల లాంగ్ సర్వీస్ మెడల్; 9 ఏళ్ల లాంగ్ సర్వీస్ మెడల్; ఎంఓఎన్‌యుఎస్‌సిఓ.   

విదేశీ పర్యటనలు: 

బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ హోదాలో పలు దేశాలలో పర్యటించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, ఖజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, శ్రీలంక, రష్యా, వియత్నాం, టాంజానియా, కెన్యా, అమెరికా, చివరిగా మాల్దీవ్స్ వెళ్లారు. 


Related Post