భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రవేశం...బెంగళూరులో ఏడుగురికి పాజిటివ్

December 03, 2021


img

యావత్ ప్రపంచ దేశాలను గడగడలాదిస్తున్న కరోనా కొత్త రూపం ఒమిక్రాన్‌ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఈవిషయం కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్వయంగా దృవీకరించారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన 66,44 ఏళ్ళ వయసున్న ఇద్దరు వ్యక్తులకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. వారిని వెంటనే క్వారెంటైన్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనాతో పోలిస్తే ఒమిక్రాన్‌ 5 రెట్లు వేగంగా ఇతరులకు వ్యాపిస్తుంది కనుక దేశ ప్రజలందరూ మళ్ళీ మాస్కులు ధరించి కరోనా జాగ్రతలన్నీ పాటించాలని లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.   

దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారికి దగ్గరగా వెళ్ళిన మరో ఐదుగురికి పరీక్షలు చేయగా వారికీ ఒమిక్రాన్‌ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, దీంతో రాష్ట్రంలో మొత్తం ఎదుగురికి ఒమిక్రాన్‌ వైరస్ సోకిందని కర్ణాటక ఆరోగ్యశాఖ తెలిపినట్లు డ్‌ క్వింట్ పత్రిక విలేఖరి నిఖిల హెన్రీ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.     Related Post