హైదరాబాద్‌కు మరో హబ్‌..ఫ్లో కెమిస్ట్రీ ఇన్నోవేషన్ హబ్‌

November 26, 2021


img

గతే ఏడేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన పారిశ్రామిక విదానాలు, పరిశ్రమల స్థాపనకు ఇస్తున్న తోడ్పాటు, ప్రోత్సాహకాల కారణంగా హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తూనే ఉన్నాయి. తాజాగా పారిశ్రామిక ఉపయోగాల కోసం ప్రత్యేకంగా ఫ్లో కెమిస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ హబ్‌ ఏర్పాటు కాబోతోంది. 

గురువారం ప్రగతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఐ‌టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ సమక్షంలో, ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ అండ్  ఫార్మా విభాగం డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌, హైదరాబాద్‌ ఫార్మాసిటీ సీఈఓ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎండీ జీవీ ప్రసాద్, డాక్టర్‌ రెడ్డీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఓరుగంటి, లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ చావా తదితరులు ఈ హబ్‌ ఏర్పాటుకు సంబందించి కన్సార్షియం ఒప్పందంపై సంతకాలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే వివిద మందులు, వాక్సిన్లు తయారుచేసే కంపెనీలు ఉన్నాయి. వాటికి అవసరమైన ముడి పదార్ధాలను (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్)కు సంబందించి పరిశోధనలు, అభివృద్ధి, ఉత్పత్తికి ఈ ఫ్లో కెమిస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ హబ్‌ ఏర్పాటు కాబోతోంది. దీంతో భారత్‌లోని ఫార్మా, లైఫ్ సైన్సస్ రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి,” అని అన్నారు.


Related Post