కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఏమి జరుగుతుందో?

October 16, 2021


img

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. పార్టీలో 23 మంది సీనియర్ నేతలు ‘జి-23’ పేరుతో పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని, పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సోనియా గాంధీకి లేఖలు వ్రాసి ఒత్తిడి చేస్తున్నారు. పార్టీలో కొంతమంది రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టాలని పట్టుబడుతుండగా, జీ-23 నేతలు రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున, పార్టీని బలోపేతం చేసుకొని, ఆయా రాష్ట్రాలకు తగిన వ్యూహాలు, పొత్తులు తదితర అంశాలపై కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోలేకపోతే దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం అనివార్యమని జి-23 నేతలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో నేడు జరుగుతున్న వర్కింగ్‌ కమిటీ సమావేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకొంది. మరి కాంగ్రెస్‌ అధిష్టానం ధైర్యంగా సరైన నిర్ణయం తీసుకోగలదో లేదో సాయంత్రంలోగా తేలిపోతుంది.


Related Post