తెలుగు సినిమా కథ మారింది..!

October 12, 2021


img

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఒకేరకమైన కమర్షియల్ ఫార్మెట్ లో సినిమాలు చేసేవారు. కాని ఈమధ్య పరిశ్రమలో ప్రయోగాత్మక సినిమాలు చాలా వస్తున్నాయి. కొత్త రక్తం.. కొత్త టాలెంట్ తో ఇండస్ట్రీ కొత్త ప్రయత్నాలకు ముందడుగు వేస్తుంది. సినిమా అంటే ఇలానే తీయాలన్న ఫార్మెట్ ను మార్చి సినిమాను ఇలా కూడా తీయొచ్చు అని తీసి చూపిస్తున్నారు. ఆడియెన్స్ కూడా వాటిని ఆహ్వానించడంతో మరికొంతమంది ప్రయోగాత్మక దర్శకులకు అది ఎంకరేజింగ్ గా ఉంది.

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అనుకుంటూ అవకాశం కోసం ఎదురుచూసే వారికి ఆ వచ్చిన ఛాన్స్ ఎలా గెలుపు బాట పట్టించాలో తెలిసింది. రొటీన్ కథని అటు తిప్పి ఇటు తిప్పి సినిమాలు తీస్తే ప్రేక్షకులు మెచ్చే రోజులు పోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ కూడా సూపర్ అనేస్తున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు మిగతా ఇండస్ట్రీ వారు కూడా ప్రస్తుతం తెలుగులో వస్తున్న అద్భుతమైన సినిమాలు చూసి షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీ హిట్లు.. పాన్ ఇండియా సినిమాలే కాదు ఐదు కోట్ల లోపు బడ్జెట్ తో చేసే సినిమాలు కూడా సూపర్ కంటెంట్ తో వస్తూ ఔరా అనిపించుకుంటున్నాయి. ఇదే ఫాం కొనసాగితే బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.



Related Post