సమంత సందేశానికి అర్ధం ఏమిటో?

October 04, 2021


img

సమంత, నాగ చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించడం అటు సినీ పరిశ్రమలోను, ఇటు వారి అభిమానులలోనూ కలకలం రేపాయి. అయితే తాము ఎందుకు విడిపోతున్నామో ఇంతవరకు వారిరువురూ చెప్పకపోవడంతో అప్పుడే సమంతకు ఎవరితోనో అఫైర్ నడుస్తోందని అందుకే వారు విడిపోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే సమంత ఇవాళ్ళ ఓ తన ఇంస్టాగ్రామ్‌లో పెట్టిన ఓ చిన్న సందేశం వారు విడిపోవడానికి చూచాయగా కారణం తెలియజేస్తోంది. ఆమె విమానంలో వెళుతూ కిటికీలో నుంచి తీసిన ఓ ఫోటో బ్యాక్ గ్రౌండ్‌తో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. “నేను ఈ ప్రపంచాన్ని మార్చాలనుకొంటే ముందుగా నేను మారాలి. నా పనులన్నీ నేనే చేసుకోవాలి. నా లక్ష్యాల గురించి పగటి కలలు కనడం మాని వాటి కోసం ప్రయత్నించాలి,” అని ఆమె సందేశం యొక్క సారాంశం.


అయితే సినిమా షూటింగులు, వ్యాయామం, టీవీ షోలు వగైరాలతో క్షణం తీరిక లేకుండా గడిపే సమంత మధ్యాహ్నం వరకు పడుకొంటుందని అనుకోలేము. కనుక ఆమె లక్ష్యసాధన...అంటే మరిన్ని మంచి సినిమాలలో నటించడంలో కుటుంబపరంగా ఆమె ఏవో సమస్యలు లేదా అభ్యంతరాలు ఎదుర్కొంటుండవచ్చు. సినీ పరిశ్రమలో నాగ చైతన్య కంటే సమంతకే మంచి నటిగా పేరుండటం, ఆ కారణంగా భార్య భర్తల మద్య ఇగో సమస్యలు, విభేదాలు తలెత్తడం సహజమే. కొన్ని ఫోటో షూట్స్ లో ఆమె ధరించిన దుస్తుల విషయంలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అక్కినేని కొడలికి ఇది తగదంటూ హితవు పలికారు. ఇదీ ఓ కారణం అయ్యుండవచ్చు. ఇటువంటి కారణాలతో చైతు లేదా సమంత వేరే వ్యక్తులకి దగ్గరైనా ఆశ్చర్యం లేదు. అదీ వారిమద్య దూరం మరింత పెంచేందుకు దోహదపడి ఉండవచ్చు. వారు విడిపోవడం గురించి మీడియాలో వచ్చిన ఊహాగానాలు నిజమైనట్లే సమంత వేరే వ్యక్తితో స్నేహం చేస్తోందనే ఊహాగానాలు నిజం కావచ్చు...అబద్దం కావచ్చు. 

కారణాలు ఏవైనప్పటికీ వారు విడిపోతుండటం నిజం. అయితే ఏ సినీ పరిశ్రమలోనైనా ఇటువంటివి సహజమే. కానీ సినీ పరిశ్రమలో మంచి పేరున్న అక్కినేని కుటుంబంలో ఇది జరుగడం, ఇంతకాలం ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటైన జంటగా అందరినీ ఆకట్టుకొన్న చైతు, సమంత విడిపోతుండటంతో అందరి దృష్టి వారిపైనే ఉందని చెప్పవచ్చు.


Related Post