మంత్రి కేటీఆర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మద్య మాదక ద్రవ్యాల వ్యవహారంపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళు నేడు మరో మలుపు తీసుకొన్నాయి. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని కోరాను,” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
నగరంలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని అడ్డుకోవాలని కోరడం తప్పు కాదు కానీ ఈ వంకతో రాజకీయాలు చేయాలనుకోవడమే సరికాదు. రేవంత్ రెడ్డి ‘వైట్ ఛాలెంజ్’ పేరుతో మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసరడాన్ని ఆవిదంగానే చూడాల్సి ఉంటుంది. మంత్రి కేటీఆర్ మాదకద్రవ్యాలు వాడుతున్నారా లేదా?తెలుసుకొనేందుకు పరీక్షలు చేయించుకోవడానికి రావాలని రేవంత్ రెడ్డి కోరడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని నిరసిస్తూ ఏదైనా ప్రచార కార్యక్రమమో చేపట్టి దానికి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించి ఉంటే గౌరవంగా ఉండేది. కానీ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి రావాలని సవాల్ విసరడం రాజకీయంగా బురద జల్లడంగానే భావించవచ్చు. కనుక ఈవిషయంలో మంత్రి కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సరైన నిర్ణయమే అని చెప్పవచ్చు.
పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకుపోతూ పార్టీ వ్యవహారాలు నడిపించే బదులు ఈవిదంగా వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే చివరికి ఆయనే, పార్టీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పార్టీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.