బాంబు వేసి చంపేసినందుకు సారి: అమెరికా

September 18, 2021


img

అగ్రరాజ్యం అమెరికా పొరపాటుకు కాబూల్‌లో  ఏడుగురు చిన్నారులతో సహా తొమ్మిది మంది చనిపోయారు. ఈ విషయం అమెరికా సెంట్రల్ కమాండర్ కెన్నెత్ ఎఫ్ మెకెంజీ స్వయంగా ప్రకటించి, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని తెలిపారు. 

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా దళాలు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయిన తరువాత తాలిబన్లు కాబూల్ విమానాశ్రయాన్ని ఆక్రమించుకొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు కాబూల్‌లో  ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో ఐసిస్-కె ఉగ్రవాది ప్రేలుడు పధార్ధాలు నింపుతున్నట్లు అనుమానించి, అమెరికా దళాలు అతనిపై డ్రోన్‌ ద్వారా బాంబు దాడి చేశాయి. ఆ దాడిలో అతనితో పాటు ఆ ఇంట్లో ఉంటున్న ఏడుగురు చిన్నారులు కూడా మరణించారు. అయితే అతను అంతర్జాతీయ ఎయిడెడ్ వర్కరుగా పనిచేస్తున్న వ్యక్తి అని, అతను కారులో నీళ్ళ బాటిల్స్ పెట్టుకొంటుండగా అమెరికా నిఘా వర్గాలు అతను ఐసిస్-కె ఉగ్రవాదని కారులో ప్రేలుడు పదార్ధాలు నింపుతున్నాడని తప్పుడు సమాచారం ఇవ్వడంతో పొరపాటున అతనిపై డ్రోన్‌ ద్వారా బాంబు దాడి జరిపామని. జరిగిన విషాదకర పొరపాటుకు చాలా చింతిస్తున్నామని కెన్నెత్ ఎఫ్ మెకెంజీ అన్నారు. 


Related Post