బిజెపి ముఖ్యమంత్రులను ఎందుకు మారుస్తోంది? కాంగ్రెస్‌ ప్రశ్న

September 13, 2021


img

దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో వరుసగా ముఖ్యమంత్రులను మార్చుతుండటంపై కాంగ్రెస్ పార్టీ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌ సీనియర్ నేత రషీద్ అల్వీ, అధికార ప్రతినిధి గౌరవ్ వల్లబ్ మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి ముఖ్యమంత్రులను ఎందుకు మారుస్తోందంటే కేంద్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, వాటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు. కరోనా కట్టడి, టీకాల పంపిణీలో ఘోరంగా విఫలమైన కేంద్రప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొని ప్రజలను ఏమార్చడానికే తన ముఖ్యమంత్రులను బలిపశువులుగా చేస్తోంది. కర్నాటకలో యడియూరప్ప, అస్సాంలో సోనోవాల్, ఇప్పుడు గుజరాత్‌లో విజయ్ రూపానీల చేత బలవంతంగా రాజీనామాలు చేయించింది. తద్వారా బిజెపి పాలిత రాష్ట్రాలలో పాలన సరిగాలేదని బిజెపి స్వయంగా ఒప్పుకొంటున్నట్లే భావించవచ్చు,” అని అన్నారు. Related Post