తెలంగాణ విమోచన దినోత్సవం పట్ల బిజెపీకి చిత్తశుద్ధి ఉందా?

September 11, 2021


img

ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బిజెపి నేతలు నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దానిలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. బిజెపి ఎంపీ సోయం బాపూరావు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తెలంగాణ ఏర్పడినప్పటి నుండి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరుతున్నా పట్టించుకోవడం లేదు. కనుక నిర్మల్ సభలో కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకొందాము. ఈ సభకు లక్ష మంది హాజరయ్యేలా జనసమీకరణ చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ సభలో సిఎం కేసీఆర్‌ నిరంకుశ, నియంతృత్వ పాలన గురించి ప్రజలకు వివరిద్దాము. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావలసిన బాధ్యత మన అందరిపై ఉంది,” అని అన్నారు.

ఏటా సెప్టెంబర్ 17న కేంద్రహోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా లేదా మరొక కేంద్రమంత్రి తెలంగాణలో జరిగే విమోచన సభకు హాజరయ్యి సిఎం కేసీఆర్‌ని, ఆయన పాలనను విమర్శించి వెళ్ళిపోతుంటారు. ఆ తరువాత టిఆర్ఎస్‌ నేతలు కూడా ఘాటుగా ప్రతి విమర్శలు చేయడంతో ఆ ఏడాదికి ‘విమోచన అధ్యాయం’ ముగుస్తుంటుంది. గత ఆరేళ్ళుగా జరుగుతున్నది ఇదే. ఈసారి జరిగేది అదే. కనుక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించడంలో బిజెపికి కూడా చిత్తశుద్ధి లేదనిపిస్తుంది.


Related Post