బుల్లెట్ రైల్ తాజా సమాచారం

September 11, 2021


img

భారత్‌లో తొలి బుల్లెట్ రైల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి ముంబై మద్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని నిర్మాణంలో వినియోగించే భారీ గర్డర్లను, ఒక్కోటి సుమారు 1100 టన్నుల బరువు, 52.5 మీటర్ల పొడవు, 37 మీటర్ల వెడల్పు ఉండే వయాడక్టులను ముందుగా నిర్మించిన స్తంభాల(కోలమ్స్)పై అమర్చే భారీ యంత్రాలు (స్ట్రడల్‌ క్యారియర్లు, గర్డర్‌ ట్రాన్స్‌పోర్టర్లు)ను తొలిసారిగా భారత్‌లోనే ఎల్ అండ్ టి సంస్థ తయారుచేసింది. తమిళనాడు, కాంచీపురంలోని తయారైన ఈ భారీ యంత్రాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభోత్సవం చేశారు.  

సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైల్ నిర్మాణం జరుగుతున్నా ఈ యంత్రాలను దక్షిణ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల నుంచి దిగుమతి చేసుకొంటారు. కానీ ఇప్పుడు భారత్‌లోనే ఈ భారీ యంత్రాలను తయారుచేయడంతో భారీగా ఖర్చు తగ్గడంతో పాటు, భారత్‌ కూడా ఇటువంటి భారీ యంత్రాలను ఎగుమతి చేయగల దేశాలలో ఒకటిగా నిలిచింది. 

అహ్మదాబాద్ నుంచి ముంబై మద్యలో 325 కిమీ మేర వయాడక్టులను ఏర్పాటుచేయవలసి ఉంటుంది. వీటిని అమర్చేందుకు ఇటువంటి భారీ యంత్రాలు మరో 20 వరకు అవసరం ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది. వాటన్నిటినీ కూడా ఎల్ అండ్ టి సంస్థ కాంచీపురంలోనే తయారుచేస్తుంది. 


Related Post