అమెరికా వైఫల్యానికి మూల్యం చెల్లిస్తున్న ఆఫ్ఘన్‌ ప్రజలు

August 17, 2021


img

నిన్న మొన్నటివరకు ఆఫ్ఘనిస్తాన్‌ గురించి పెద్దగా వార్తలు లేవు కనుక ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ అమెరికన్ దళాలు ఉపసంహరించిన రెండు మూడు వారాలలోపే తాలిబన్లు ఆ దేశాన్ని, ప్రభుత్వాన్ని వశపరుచుకోవడం, వారి భయంతో ఆఫ్ఘన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇరుగుపొరుగు దేశాలకు పారిపోతుండటంతో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్‌ అంతర్జాతీయవార్తలలో ప్రధానాంశంగా మారింది. ఆఫ్ఘన్‌ సంక్షోభంతో తమకు సంబందం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేతులు దులుపుకొన్నప్పటికీ, ఖచ్చితంగా దీనికి అమెరికాయే కారణమని చెప్పక తప్పదు. 

ప్రపంచశాంతిని కాపాడుతామంటూ ఇతర దేశాల ఆంతరంఘిక వ్యవహారాలలో తలదూర్చడం అమెరికాకు అలవాటే. కానీ అమెరికా సేనలు కాలుపెట్టిన ఏ దేశంలోనూ శాశ్విత శాంతిని నెలకొల్పలేకపోయాయి. ఇతర దేశాలలో అమెరికన్ సేనలను మోహరిండం తప్పుడు నిర్ణయమని, ఇది తెలుసుకోవడానికి దశాబ్ధాలు పట్టిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా అంగీకరించారు. అమెరికాకు గొప్ప ఆర్ధికశక్తి, గొప్ప సాంకేతిక పరిజ్ఞానం, గొప్ప ఆయుధ సంపత్తి ఉంది కానీ దూరదృష్టి లేదని చెప్పడానికి ఆఫ్ఘన్‌ తాజా సంక్షోభం నిరూపిస్తోంది.


నిజమే…రెండు దశాబ్ధాల పాటు అమెరికా బిలియన్ల డాలర్లు ఆఫ్ఘనిస్తాన్‌ కోసం ఖర్చు చేసింది. తమకు సంబందమేలేని తాలిబన్లతో పోరాడుతూ దేశంకాని దేశంలో వేలాదిమంది అమెరికన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. కానీ రెండు దశాబ్ధాల వారి కష్టం రెండువారాలలో పూర్తిగా కొట్టుకుపోయింది. అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా మరోమారు ఘోరంగా విఫలమైందని స్పష్టం అవుతోంది. అమెరికా వైఫల్యానికి ఇప్పుడు ఆఫ్ఘన్‌ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మూల్యం చెల్లించవలసి రావడం చాలా బాధాకరం. 


సౌదీ అరేబియా తదితర కొన్ని గల్ఫ్ దేశాధినేతలకు ఆఫ్ఘనిస్తాన్‌తో సత్సంబంధాలున్నందున వారు మాత్రమే ఈ సంక్షోభాన్ని పరిష్కరించగలరేమో? 


Related Post