హుజూరాబాద్‌ ఉపఎన్నిక వాయిదా?

July 31, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లేఖ వ్రాసింది. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నందున మరి కొంత కాలం ఎన్నికలను వాయిదా వేయాలని లేఖలో కోరింది. 

ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీకాలం జూన్‌ 3వ తేదీన ముగిసింది. కనుక అంతకంటే ముందే ఆ ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. కానీ కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మే 13న కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. 

ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న రాజీనామా చేశారు. కనుక రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లోగా అంటే డిసెంబర్‌ 12లోగా ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కనుక ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలల్లో ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడుతుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలనే వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నప్పుడు, భారీ స్థాయిలో జరిగే హుజూరాబాద్‌ ఉపఎన్నికను నిర్వహించాలని కోరలేదు. కనుక ఉపఎన్నిక కూడా వాయిదాపడవచ్చు.


Related Post