బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్‌?

July 27, 2021


img

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌  వచ్చే నెల 8వ తేదీన రాష్ట్రంలోని బహుజన్ సమాజ్‌వాదీ (బీఎస్పీ)లో చేరానున్నారు. ఈవిషయం ఆయన ఇంకా ప్రకటించలేదు కానీ బీఎస్పీలో చేరడం ఖాయమేనని తెలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలైనప్పటికీ నేటికీ బడుగుబలహీనవర్గాలకు పూర్తి న్యాయం జరగడంలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. ఆ కారణంగానే ఆయన ఇంకా ఆరేళ్లు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని ప్రజల మద్యకు వచ్చారు. 

అయితే తన ప్రాధాన్యాలు బడుగుబలహీనవర్గాలకు విద్య, వైద్యం, ఉపాది మాత్రమేనని రాజకీయాలు కావని స్పష్టంగా చెప్పారు. కానీ రాజకీయాలు, పదవి, అధికారం లేకుండా తన ఆశయసాధనా కష్టమని ఆయన ముందే గ్రహించారు. కనుక తన భావజాలానికి దగ్గరగా ఉండే బీఎస్పీ పార్టీని ఎంచుకొని ఉండవచ్చు. 

అయితే రాష్ట్రంలో లక్షలాదిమంది బడుగుబలహీనవర్గాల ప్రజలున్నప్పటికీ వారికి ప్రాతినిధ్యం వహించాల్సిన బీఎస్పీ ఉనికే లేకపోవడం విచిత్రం. బహుశః ప్రవీణ్ కుమార్‌ ఆ పార్టీ పగ్గాలు చేపట్టి తన సారధ్యంలో ఆ పార్టీతో బడుగుబలహీనవర్గాలను ఏకం చేసి సంఘటిత శక్తిగా మలచాలనుకొంటున్నారేమో?కానీ ఈ ప్రయత్నంలో మూడు ప్రధాన పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లను కూడా ఆయన ఎదుర్కోగలగాలి. అది ఆయన వలన సాధ్యమా కదా అనేది కాలమే చెపుతుంది. 


Related Post