హమాలీ పనే ఉద్యోగం...ఉపాధి కాదా?మంత్రి నిరంజన్ రెడ్డి

July 16, 2021


img

వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టారు. ఉద్యోగాల భర్తీపై ఇప్పటికే ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తుంటే, హమాలీ పని కంటే గొప్ప ఉద్యోగం, ఉపాధి ఏముంటుందని, ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును అందరూ వినియోగించుకోవాలని అన్నారు. 

గురువారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో దిశ సమీక్షా సమావేశానికి హాజరైనప్పుడు మాట్లాడుతూ, “ఇప్పుడు రాష్ట్రంలో యాసంగి, వర్షాకాలంలో వ్యవసాయ పనులు చేసుకొని ఆ తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీ పనూలు చేసుకొనే వెసులుబాటు ప్రతీ గ్రామానికి వచ్చింది. ఇంతకంటే గొప్ప ఉపాధి ఏముంటుంది? ఇది ఉపాధి... సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కాదా? ఈవిదంగా ఆలోచించకుండా చదువుకునోళ్ళు అందరికీ సర్కారీ నౌకరీలు కావాలంటే ఎలా?చదువుకొన్న ప్రతీ ఒక్కరికీ సర్కారీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఓ పక్క కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. కాంగ్రెస్‌, బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా ఉద్యోగులను పీకేస్తున్నాయి. కానీ ఆ రెండు పార్టీలు తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నాయి. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాయి,” అని అన్నారు.


Related Post