పోరాటాలతో మావోయిస్టులు చివరికి సాధించింది ఏమిటి?

July 14, 2021


img

మావోయిస్ట్ అగ్రనేతలలో ఒకరిగా చెప్పబడుతున్న రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ఇవాళ్ళ హైదరాబాద్‌లో డిజిపి మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దశాబ్ధాలుగా మావోయిస్టులు పోరాడుతూనే ఉన్నారు. వారికీ పోలీసులకు మద్య అప్పుడప్పుడు ఎదురు కాల్పులు జరుగుతుండటం, వాటిలో అనేక మంది పోలీసులు, మావోయిస్టులు చనిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వారి ఈ పోరాటాలు మారణ హోమం దశాబ్ధాలుగా సాగుతూనే ఉంది. కానీ ఇంతవరకు వారిలో ఎవరూ విజయం సాధించలేకపోయారు.

దేశ రాజకీయ, ప్రజాస్వామిక, సామాజిక వ్యవస్థలలో మావోయిస్టులు కోరుకొంటున్న మార్పులేవీ  రాలేదు పైగా నానాటికీ పరిస్థితులు ఇంకా దిగజారుతూనే ఉన్నాయి. అంటే పోలీసులు-మావోయిస్టుల ఈ పోరాటాలు, వారి కష్టాలు, త్యాగాలు అన్నీ అర్ధరహితమేనని అర్ధం అవుతోంది. అయినప్పటికీ మావోయిస్టులు శరీరం సహకరించినంత కాలం పోరాడి పోలీసుల చేతిలో మరణించడమో లేదా ఇక పోరాడే శక్తి, ఓపిక అయిపోతే ఈవిదంగా జనజీవన స్రవంతిలో కలుస్తుండటమో జరుగుతోంది.

చివరికి ఈ పోరాటలలో వారు ప్రాణాలు కోల్పోయినా, పోలీసులకు లొంగిపోయినా సాధించిందేమీలేదని తెలుసుకొనేసరికి వారి జీవితాలలో చాలా విలువైన కాలం వెళ్ళిపోతుంది. ఇక చేయగలిగింది ఏమీ ఉండదు. కానీ ముందే మేల్కొని వారు కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినట్లయితే ప్రజలకు ఎంతో సేవ చేయగలరు. రాజకీయాలలో, సమాజంలో వారు కోరుకొంటున్న మార్పు తీసుకురాగలరు. అందుకు ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. కనుక మావోయిస్టులు తమ వైఖరిపై పునరాలోచన చేయడం మంచిది. 



Related Post