తెలంగాణ విద్యార్ధిని శ్వేతారెడ్డికి రెండు కోట్లు స్కాలర్‌షిప్‌

July 13, 2021


img

ఆమె వయసు కేవలం 17 ఏళ్ళే. కానీ చదువుల్లో ఆమె కనబరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలకు అమెరికాలోని లాఫాయేట్ కాలేజీ ఆమెకు ఏకంగా రెండు కోట్లు స్కాలర్‌షిప్ ప్రకటించింది. ఆమె పేరు శ్వేతారెడ్డి. డైయర్ ఫెలోషిప్ పేరిట ఇస్తున్న ఈ స్కాలర్‌షిప్‌కు వివిద దేశాల నుంచి మొత్తం ఆరుగురు విద్యార్దులు ఎంపికకాగా వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్వేతారెడ్డి కూడా ఒకరు. ఆమె మ్యాధ్స్, కంప్యూటర్ సైన్స్‌లో నాలుగేళ్ల డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకోగా, తమ కాలేజీలో చదువుకొనేందుకు రెండు కోట్లు స్కాలర్‌షిప్ ఇవ్వబోతున్నట్లు లాఫాయేట్ కాలేజీ ప్రకటించింది. 

విదేశీ యూనివర్సిటీలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం  అవసరమైన ముందస్తు శిక్షణ ఇచ్చే హైదరాబాద్‌లోని డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థలో ‘డెక్స్‌టెరిటీ టూ కాలేజ్ అనే కేరిర్ డెవలప్‌మెంట్‌ అనే కోర్సులో శిక్షణ పొందింది. తనకు చక్కటి మార్గదర్శనం చేసి జీవితంలో ఎన్నడూ ఊహించలేని ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు ఆ సంస్థ సీఈఓ శరద్ సాగర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంది. శ్వేతారెడ్డి వ్యక్తిగత, కుటుంబానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.



Related Post