కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్‌ టికెట్ ఖాయమైనట్లేనా?

July 12, 2021


img

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జ్ కౌశిక్ రెడ్డి తనకు హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో పోటీ చేసేందుకు టిఆర్ఎస్‌ టికెట్ ఖరారు అయ్యిందంటూ ఓ కార్యకర్తకు చెప్పినట్లు వచ్చిన వార్త కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంతవరకు ఆయన స్పందించలేదు. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నందున టిఆర్ఎస్‌ కూడా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనిపై సంజాయిషీ కోరుతూ కౌశిక్ రెడ్డికి షో-కాజ్ నోటీసు ఇచ్చింది. కనుక ఆయన దీనిపై రేపటిలోగా స్పష్టత ఈయక తప్పదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసినట్లయితే, వెంటనే ఆయన టిఆర్ఎస్‌లో చేరితే హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో పోటీ చేయడం ఖాయమనే భావించవచ్చు.        



Related Post