తెలంగాణకు అన్యాయం చేసిన వైఎస్సార్ దేవుడెలా అవుతారు?

July 10, 2021


img

మంత్రి హరీష్‌రావు వైఎస్ షర్మిల నేతృత్వంలో కొత్తగా స్థాపించబడిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీపై సునిశిత విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ అనే పదం పలికినందుకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మమ్మల్ని శాసనసభ బయటకు పంపించి ఘోరంగా అవమానించారు. తెలంగాణకు...తెలంగాణ ప్రజలకు అన్నివిదాల అన్యాయం చేసిన ఆయన దేవుడెలా అవుతారు?ఆయన వారసులమని చెప్పుకొని వస్తున్నవారు అవకాశవాద రాజకీయాలు చేయడానికి వస్తున్నారు తప్ప వారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల వారికి ఎటువంటి అభిమానం లేదు. అటువంటి అవకాశవాద రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు,” అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళలో చేయలేని అభివృద్ధిని మా ప్రభుత్వం కేవలం ఏడేళ్ళలో చేసి చూపింది. దేశంలో ప్రతీ గ్రామానికి ఓ ట్రాక్టరు, నీళ్ళ ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతునన్ని సంక్షేమ పధకాలు మరే రాష్ట్రంలో అమలవడం లేదు. త్వరలోనే 57 ఏళ్ళ వారికి కూడా వృద్ధాప్య పింఛను ఇస్తాము. త్వరలోనే 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాము,” అని మంత్రి హరీష్‌రావు చెప్పారు. 


Related Post