ధరణీలో మరిన్ని సేవలు... ఆప్షన్లు అందుబాటులోకి

July 03, 2021


img

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌ 2వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్‌లో ఊహించినట్లే తొలుత అనేక సమస్యలు ఎదురైనప్పటికీ క్రమంగా వాటన్నిటినీ పరిష్కరించుకొంటూ ఇప్పుడు ధరణీలో మరిన్ని సేవలు, ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ధరణీలో 20 రకాల సేవలు లభిస్తున్నాయి.   

1. స్లాట్‌ బుకింగ్‌

2. వ్యవసాయ భూముల అమ్మకం, గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌లు 

3. మ్యుటేషన్‌ (భూమిని అమ్మిన వ్యక్తి పేరు స్థానంలో కొనుగోలుదారు పేరు చేర్చడం)

4. వారసత్వంగా వచ్చిన భూమిని కుటుంబ సభ్యుల మద్య పంపకాలు 

5. నాలా మరియు పాస్‌బుక్‌ లేకుండా నాలా మరియు పెండింగ్‌ నాలా దరఖాస్తులు

6. మార్టిగేజ్‌ రిజిస్ట్రేషన్‌ (తనఖా రిజిస్ట్రేషన్)

7. లీజు అగ్రిమెంట్ 

8. ధరణి పోర్టల్‌ ప్రవేశ పెట్టక మునుపు జరిగిన జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) లావాదేవీలు మరియు ఆ తర్వాత జరిగిన జీపీఏ లావాదేవీలు 

9. జీపీఏ రిజిస్ట్రేషన్‌ మరియు డెవలపర్‌ కమ్ జీపీఏ రిజిస్ట్రేషన్‌

10. వివిద భూసమస్యలు మరియు భూసేకరణ వినతులు 

11. నిషేధిత భూముల కేటగిరీలో పొరపాటున నమోదైన సర్వే నంబర్ల తొలగింపు

12. స్లాట్‌ రద్దు మరియు రీషెడ్యూల్‌ చేసుకునే ఆప్షన్స్

13. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల ధ్రువీకరణ

14. విదేశాలలో నివశిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌

15. ఆధార్‌ ధ్రువీకరణ కాని భూములకు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తులు 

16. ఫర్మ్‌లు, కంపెనీల భూములకు పాస్‌పుస్తకాలు

17. సెమీ అర్బన్‌ భూములకు పాస్‌ పుస్తకాలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాస్‌పుస్తకాలు మరియు డూప్లికేట్‌ పాస్‌పుస్తకాలకు దరఖాస్తు ఆప్షన్లు

18. కోర్టుకేసుల్లోని భూములపై లావాదేవీల నిలిపివేత కొరకు దరఖాస్తులు

19. సాంకేతిక సమస్యలకు సంబంధించిన వినతులు

20. భూవివరాల గోప్యత 

ధరణీ పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ కొత్త సేవలు, ఆప్షన్లను ప్రవేశపెడుతుండటంతో ధరణీ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు వేగం పుంజుకొన్నాయి. ఇప్పటివరకు ధరణీ ద్వారా మొత్తం 8 లక్షల లావాదేవీలు జరగడమే ఇందుకు మంచి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే నేటికీ ధరణీ పోర్టల్‌లో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. వాటినీ పరిష్కరించగలిగితే దేశంలోనే రైతులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది.


Related Post