రేవంత్‌కి చంద్రబాబే ఆ పదవి ఇప్పించాడు: విజయసాయి రెడ్డి

June 28, 2021


img

పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియామకంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా రేవంత్‌ రెడ్డికి ఆ పదవి టిడిపి అధినేత చంద్రబాబునాయుడే ఇప్పించాడంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించిన చంద్రబాబు తరువాత ఆయన సహకారంతో గత శాసనసభ ఎన్నికలలో టిడిపి, కాంగ్రెస్‌ పొత్తు కుదిరించారు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబునాయుడు ఢిల్లీలో కొందరు కాంగ్రెస్‌ పెద్దలను కొనేసి రేవంత్‌ రెడ్డికి ఆ పదవి దక్కేలాచేశారు. తద్వారా పరోక్షంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకొన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు నుంచి రక్షణ పొందేందుకు తన ఎంపీలను బిజెపిలోకి పంపించి వారి ద్వారా తనను తాను కాపాడుకొంటున్నారు. ఆ కేసును అటక మీద నుంచి కిందకు దించకుండా అడ్డుకొనేందుకు ఇప్పుడు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణను గులాబీ పార్టీలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందరినీ మేనేజ్ చేయడంలో చంద్రబాబునాయుడు ఘనుడు,” అని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌, టిడిపి నేతలు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి. 



Related Post