ఇండస్ట్రీలో సమస్యలు చూస్తూ ఊరుకోలేకనే పోటీ: ప్రకాష్ రాజ్‌

June 25, 2021


img

ఈసారి కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పాలకమండలి ఎన్నికలు చాలా వేడివేడిగా జరుగబోతున్నాయి. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆయన సుమారు మూడు దశాబ్ధాలుగా తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. కనుక చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, దానిలో పని చేస్తున్న వేలాదిమంది సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు, కార్మికుల కష్టాలు, కన్నీళ్ళ గురించి కూడా బాగా తెలుసు. కనుక ఆ సమస్యలను పరిష్కరించాలనే తాపత్రయంతో ఈసారి ఆయన కూడా పోటీ చేస్తున్నారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పింది విన్నట్లయితే తెలుగు సినీ పరిశ్రమ పట్ల ఆయనకున్న నిబద్దత, అభిమానం కొత్తవచ్చినట్లు కనబడుతుంది. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “తెలుగు సినీ పరిశ్రమ నాకు ఎంతో ఇచ్చింది. పేరు ప్రతిష్టలు, డబ్బు, సమాజంలో గౌరవం, ముఖ్యంగా తెలుగు ప్రజల ప్రేమాభిమానాలనులను పొందగలిగాను. నాకు ఇంత ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమలో ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు కంటికి కనబడుతుంటే నాకెందుకు లే... అని పట్టన్నట్లు ఉండలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ళపాటు అంతర్మధనం తరువాత ఈ నిర్ణయం తీసుకొన్నాను తప్ప రాత్రికి రాత్రి తీసుకొన్నది కాదిది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను... దీనిలో పనిచేస్తున్న వేలాదిమంది పడుతున్న కష్టాలను తీర్చి రుణం తీర్చుకోవాలని అనుకొంటున్నాను. అందుకే ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. సినీ పరిశ్రమలో చేసేవారందరూ ఆత్మగౌరవంతో సంతోషంగా జీవించాలని కోరుకొంటున్నాను. వారే కాదు... వారి కుటుంబ సభ్యులు సైతం అంతే ఆత్మగౌరవంతో సంతోషంగా జీవించాలని కోరుకొంటున్నాను,” అని చెప్పారు. 


Related Post