టాటా స్టీల్ సంచలన నిర్ణయం

May 25, 2021


img

టాటా కంపెనీకి ఓ ప్రత్యేకత ఉంది. అది మానవీయకోణంలో వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తుంటుంది. భారత్‌కు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు వస్తుంది. అటువంటి గొప్ప సంస్థ తన ఉద్యోగులను ఇంకెంత గొప్పగా చూసుకొంటుందో తెలుసుకొనేందుకు ఇది ఓ తాజా నిదర్శనంగా నిలుస్తోంది.  

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలలో ఒకటైన టాటా స్టీల్ తమ ఉద్యోగులలో ఎవరైనా కరోనాతో చనిపోతే, వారి కుటుంబాలకు ఆ ఉద్యోగి రిటైర్‌మెంట్ సమయం వరకు నెలనెల జీతం అందజేయాలని నిర్ణయించింది. ఆ ఉద్యోగి చనిపోయేనాటికి చివరిగా ఎంత జీతం తీసుకొన్నాడో అంతే అందజేస్తామని టాటా స్టీల్ ప్రకటించింది. దాంతోపాటు ఆ కుటుంబాలకు యధాప్రకారం హౌసింగ్ మరియు మెడికల్ సేవలు కూడా అందిస్తామని ప్రకటించింది.  

కంపెనీ ఉద్యోగులలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నవారు కరోనాతో చనిపోయినట్లయితే వారి కుటుంబాలకు జీతం, ఇల్లు, వైద్య సౌకర్యాలతో పాటు ఆ ఉద్యోగి పిల్లలకు దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే వరకు చదువుకయ్యే మొత్తం ఖర్చు భరిస్తామని టాటా స్టీల్ ప్రకటించింది. 

భారత్‌లో అనేక సంస్థలు లాక్‌డౌన్‌ సమయంలో నిర్ధాక్షిణ్యంగా తమ ఉద్యోగులను వదిలించుకొని రోడ్డున పడేయడం అందరూ చూశారు. కానీ టాటా సంస్థ చనిపోయిన తన ఉద్యోగుల పట్ల కూడా ఇంత ఔదార్యం చూపడం చాలా గొప్ప విషయమే కదా?



Related Post