నేతలు పార్టీ వీడితే ప్రజాభిప్రాయం కూడా మారుతుందా?

May 19, 2021


img

రాజకీయ నేతలు ఏదైనా ఓ పార్టీలో ఉన్నప్పుడు తమ పార్టీ..తమ అధినేత గురించి, ఒకవేళ అధికారంలో ఉంటే తమ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకొంటుంటారు. అదే నేతలు..పార్టీని వీడితే ఇదివరకు చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటారు. రాజకీయాలలో ఇవి చాలా సహజం. అయితే ఓ నేత పార్టీ మారితే అతను లేదా ఆమెపై ప్రజలకుండే నిర్ధిష్టమైన అభిప్రాయాలు రాత్రికి రాత్రే మారిపోతాయా? అంటే అవుననే అంటున్నారు మంత్రి గంగుల, ఈటల రాజేందర్.  

మంత్రి పదవి నుంచి తొలగింపబడిన తరువాత, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా...హుజూరాబాద్‌ నియోజకవర్గం ప్రజలు తనవెంటే ఉన్నారని ఈటల రాజేందర్‌, కానే కాదని మంత్రి గంగుల కమలాకర్ వాదించుకొంటున్న సంగతి తెలిసిందే. ఈటల బయటకు వచ్చారు కనుక ఆయనను ఎన్నుకొన్న ప్రజలు ఆయనతోనే ఉంటారా లేక టిఆర్ఎస్‌తో పెట్టుకొంటున్నారు కనుక ఆయనను తెలంగాణ శత్రువుగా భావిస్తారా? మంత్రి గంగుల, ఈటల వాదనలలో వేటిని ప్రజలు నమ్ముతారు? ఎవరివైపున్నారు? ఎందుకున్నారు? అనే ప్రశ్నలకు ఎవరికివారు సమాధానం చెప్పుకోవాలి.   

ఒకవేళ గంగుల వాదనలతో ఏకీభవిస్తే ప్రజల అభిప్రాయాలు కూడా రాత్రికి రాత్రే మారిపోతాయనుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈటలతో వారు ఏకీభవిస్తే తమ అభిమాన నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలను ప్రజలు పట్టించుకోరనుకోవాల్సి ఉంటుంది. ఈవిదంగా మన రాజకీయ నేతలు ప్రజల విచక్షణకు కూడా పరీక్ష పెడుతున్నారు. మరి ప్రజాభిప్రాయం ఏమిటో... చూడాలి.


Related Post