అంబులెన్సులు అడ్డుకోవడానికి వీల్లేదు: హైకోర్టు

May 14, 2021


img

పొరుగు రాష్ట్రాల నుంచి కరోనా రోగులను చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకువస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకోవడాని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

హైదరాబాద్‌లోని ఏదైనా ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేసేందుకు ఆసుపత్రి ఇచ్చిన అనుమతి పత్రం ఉంటే తప్ప పొరుగు రాష్ట్రాల అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించకూడదని తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించింది. 

దేశంలో మరే రాష్ట్రంలోని ఈవిదంగా అంబులెన్సులను అడ్డుకోవడం లేదని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ ఆంక్షలు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. అయినా హైదరాబాద్‌ ప్రజలకే ఆసుపత్రులు బెడ్లు కన్ఫర్మ్ చేయనప్పుడు ఇతర రాష్ట్రాల రోగులకు ఏవిదంగా ముందుగా కన్ఫర్మ్ చేస్తాయని ప్రశ్నించింది. 

అంబులెన్సులను రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని నేషనల్ హైవే యాక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆ అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రాల అంబులెన్సులను అడ్డుకోవడానికి వీలులేదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.


Related Post