గత కొంతకాలంగా కాంగ్రెస్, బిజెపి నేతలు మంత్రి ఈటల రాజేందర్‌ను వెనకేసుకువస్తూ కేటీఆర్‌కు బదులు ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని వాదించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సిఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌పై అవినీతిముద్ర వేసి పదవిలో నుంచి తొలగించడంతో కాంగ్రెస్, బిజెపిలు కూడా షాక్ అయ్యాయి. ఇదివరకులాగా ఇప్పుడు ఆయనను వెనకేసుకువస్తూ గట్టిగా మాట్లాడలేకపోయాయి. కనీసం స్పందించలేకపోయాయి. అందుకు కారణం ఈటల రాజేందర్‌పై భూకబ్జాల అవినీతి ముద్రపడటమే. ఆవిదంగా సిఎం కేసీఆర్ ప్రతిపక్షాలను ఆయనను దూరంగా ఉంచేలా చేయగలిగారని చెప్పవచ్చు లేకుంటే అటువంటి బలమైన నాయకుడి కోసం వెతుకుతున్న బిజెపి నేతలు ఆయన ముంగిట్లో వాలిపోయి పార్టీలోకి ఆహ్వానించేవారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండేవారు. కాంగ్రెస్, బిజెపి నేతలు టిఆర్ఎస్...ప్రభుత్వంలో జరుగుతున్న ఈ హతాత్పరిణామాలపై ఏవిదంగా స్పందించాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయారు. బహుశః ఈ పరిణామాలను నిశితంగా గమనించి, తదనంతర పరిణామాలను లెక్కగట్టుకొన్నాక రెండు పార్టీలు స్పందించవచ్చు.