నిన్నటితో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ఫలితాలపై వివిద మీడియా సంస్థలు చేసిన సర్వే ఫలితాలను ప్రకటించాయి. వాటితో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాలపై కూడా వాటి సర్వే ఫలితాలను ప్రకటించాయి. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి కె.జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్ గెలువబోతున్నట్లు తేల్చి చెప్పాయి.
మిషన్ చాణక్య సర్వే రిపోర్ట్:
ఓట్ షేర్: టిఆర్ఎస్: 49.25, కాంగ్రెస్: 37.92, బిజెపి: 7.80, ఇతరులు: 5.04 శాతం.
ఓట్లు: టిఆర్ఎస్:93,450, కాంగ్రెస్: 71,964, బిజెపి: 14,806, ఇతరులు: 9,561 ఓట్లు.
ఆరా సర్వే రిపోర్ట్:
ఓట్ షేర్: టిఆర్ఎస్: 50.48, కాంగ్రెస్: 39.93, బిజెపి: 6.31, ఇతరులు: 3.28 శాతం
ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్:
ఓట్ షేర్: టిఆర్ఎస్:43.5, కాంగ్రెస్: 39.5, బిజెపి: 14.6, ఇతరులు: 2.4 శాతం.